హైదరాబాద్:భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకబాదిన ఘటన నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహిళతో ఏకాంతంగా ఉన్న సమయంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.. ఆ మహిళను, భర్తను ఇద్దరిని చితకబాదింది. భర్తను బట్టలూడదీసి కొట్టింది. ఆదివారం ( జనవరి 4 ) హైదరాబాద్ లోని సైదాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
సైదాబాద్ చంద్రదయ్య హట్స్ లో నివాసం ఉంటున్న బందెల బాబు.. ఇంటెలిజెన్ష్ డిపార్టుమెంట్ లో అటెండర గా పనిచేస్తున్నాడు. బాబుకు అదే ప్రాంతానికి చెందిన బరిగెల జ్యోతితో 2010లో వివాహం అయ్యింది.. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతిని కట్నం కోసం వేధింపులకు గురి చేసేవాడని స్థానికులు, జ్యోతి ఆరోపిస్తోంది. ఈ క్రమంలో వారిమధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
2015లో భర్త,అ తని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధించారని పంచాయతీ పెట్టగా పెద్ద మనుషులు నచ్చజెప్పారు. అయితే 2020లో మరోసారి గొడవలు ముదిరి జ్యోతి ఫిర్యాదు చేయడంతో చార్మినార్ పీఎస్ లో వరకట్నం ,వేధింపుల కేసు నమోదు అయ్యింది. అప్పటినుంచి మరో మహిళ (కాంచన) తో అక్రమ సహజీవనం చేస్తున్నట్లు బాబు భార్య జ్యోతి ఆరోపిస్తోంది.
ఈ క్రమంలో ఆదివారం బాబు, అతని ప్రియురాలు ఇద్దరి కలిసి ఉన్న సమయంలో బంధువులతో కలిసి వెళ్లి వారి గుట్టు రట్టు చేసింది. చైతన్య పురి న్యూ దిల్ సుఖ్ నగర్ రోడ్ నంబర్ 3లోని ఓ ఇంట్లో బాబు, అతని ప్రియురాలు ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బాబు, అతని ప్రియురాలిని ఇంట్లోంచి బయటికి లాగి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
