లులూ మాల్ లూటీ చేశారు.. తినేశారు.. తాగేశారు.. ఊడ్చేశారు..

లులూ మాల్ లూటీ చేశారు.. తినేశారు.. తాగేశారు.. ఊడ్చేశారు..

హైదరాబాదీలు మాములోళ్లా ఏంటీ.. కొత్తగా ఏదైనా వస్తే ఎర్రెక్కిపోతారు.. పిచ్చేక్కిపోతారు.. దాని అంతు చూసే వరకు వదలరు.. ఇలాంటి సిట్యువేషన్స్ గతంలో ఐకియా ఓపెన్ అయినప్పుడు జరిగింది.. మెట్రో ఓపెన్ అయినప్పుడు జరిగింది.. ఇప్పుడు ఆ లిస్టులో లులూ మాల్ చేరిపోయింది. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ప్రారంభం అయిన లులూ షాపింగ్ మాల్ చూడటానికి జనం ఎగబడ్డారు.. ఎంతలా అంటే గంటల కొద్దీ ట్రాఫిక్ జాం అయ్యే విధంగా.. వరసగా ఐదు రోజులు సెలవులు కావటంతో.. జనం అంతా అక్కడే ఉన్నారు...

ALSO READ: బీ అలర్ట్ : 4వ తేదీ ఉదయం (బుధవారం).. కేబుల్ బ్రిడ్జి చుట్టూ ట్రాఫిక్ మళ్లింపు

లులూ సూపర్ మార్కెట్ కు వెళ్లిన జనం.. మాల్ లోని వస్తువులను మామూలుగా వాడేశారు.. అక్కడ ఉన్న కూల్ డ్రింగ్స్ ను తాగేశారు.. స్నాక్ ప్యాకేట్ ను తినేసి అక్కడే పెట్టేశారు.. బిస్కెట్లు, చాక్కెట్లను చప్పరించేశారు.. ఖాలీ ర్యాపర్స్ ను చక్కగా మళ్లీ అక్కడే ర్యాకుల్లో పడేశారు.. బాక్సుల్లో పెట్టిన ఎగ్ పప్స్, వెబ్ పఫ్స్ ను చక్కగా తినేశారు.. కొందరు అయితే వాటిని టేస్ట్ చేయటం కోసం కొంచెం తిని.. మిగతాది అదే బాక్స్ లో పెట్టేశారు.. 

తెలంగాణలో ఫస్ట్ లులూ స్టోర్ కావటంతో.. ఎలా ఉంది.. ఏం ఉన్నాయి.. ఏయే వస్తువులు ఉన్నాయి.. ఎంతెంత ధరల్లో ఉన్నాయి అనేది తెలుసుకోవటం కోసం.. చూడటం కోసం తిరనాళ్లకు వచ్చినట్లు వచ్చారు జనం.. ఐదు రోజులు అయితే ట్రాఫిక్ నరకం.. అంతలా తండోపతండాలుగా వచ్చారు జనం. వచ్చినోళ్లల్లో అందరూ కాదు కానీ.. కొందరు మాత్రం ఇలా చేసి వెళ్లారు.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. 

హైదరాబాద్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది.. మాతో పెట్టుకుంటే ఇంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..