- తమ్మిడికుంట, సున్నం చెరువుల పునరుద్ధరణ పనుల పరిశీలన
మాదాపూర్, వెలుగు: మాదాపూర్లోని తమ్మిడికుంట, సున్నం చెరువుల పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు నెలల్లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు చుట్టూ పచ్చదనం పెంచడం ద్వారా ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గేలా చూడాలని, పాత్ వేలు, సీటింగ్ వ్యవస్థతో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు.
చెరువుల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములను, ముఖ్యంగా సున్నం చెరువు సర్వే నంబర్లు 30, 31లోని భూమిని అంగుళం కూడా పోకుండా సెక్యూర్ చేయాలని ఆదేశించారు. తమ్మిడికుంట ఎగువన వ్యర్థాలు వేయడం వల్ల నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
