హైదరాబాద్ లో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. చట్టబద్దమైన అనుమతులున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది . చెరువుల సమీపంలో అన్ని అనుమతులున్న నిర్మాణాలను కూడా కూల్చివేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పింది. చెల్లుబాటు అయ్యే అనుమతులున్న ఏ నిర్మాణాలను సీఎం కూల్చొద్దన్నారని హైడ్రా తెలిపింది. సీఎం ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని హైడ్రా వెల్లడించింది.
హైదరాబాద్ లో బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న ఆక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రా కూల్చివేతలపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రా స్పష్టతనిచ్చింది.