- వరదలు లేనప్పుడు ట్రాఫిక్ సేవలు
- మొదటి విడతగా50 మందికి ట్రైనింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇకపై హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది ట్రాఫిక్ వాలంటీర్లుగా పోలీసులకు సహకరిస్తారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. మొదటి విడతగా గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో 50 మందికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.
అక్కడ మెలకువలు నేర్చుకుంటున్నారని, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల టైంలో రేడియం జాకెట్లు వేసుకుని ముఖ్యమైన చౌరస్తాలు, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు తోడుగా సేవలందిస్తారని వెల్లడించారు.