- హైడ్రా కమిషనర్ రంగనాథ్
రామచంద్రాపురం, వెలుగు: చెరువులు, కుంటలకు సంబంధించిన అలుగులు, సర్ ప్లస్ఏరియాలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తే భవిష్యత్ప్రళయాలకు కారణం అవుతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. శనివారం తెల్లాపూర్ గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. మేళ్ల చెరువు ఆక్రమణ, అలుగు సర్ ఫ్లస్ఛానల్పై నిర్మాణాల విషయంలో హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. తెల్లాపూర్ మేళ్ల చెరువు అలుగు కాల్వపై ఓ భారీ నిర్మాణ సంస్థ రోడ్డును నిర్మించగా గ్రామస్తులు హైడ్రాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా రంగనాథ్ నిర్మాణ సంస్థను హెచ్చరిస్తూ పలు సూచనలు చేశారు.
ప్రస్తుత కల్వర్టు నిర్మాణం వల్ల ఆరు ఫీట్ల కాల్వ మూసుకు పోతుందని, తక్షణమే కల్వర్టు డిజైన్ మార్చాలని సూచించారు. నాలా లోపల వేసిన రెండు పిల్లర్లను తొలగించి ఒకే బీమ్‌తో కల్వర్టుపై స్లాబ్ నిర్మాణం చేసుకోవాలని చెప్పారు. గ్రామానికి ముప్పు కలిగే నిర్మాణాలు చేయరాదని, డిజైన్ మార్చి కల్వర్టును సరి చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మేళ్ల చెరువు పరివాహాక ప్రాంతంలో మట్టి పోసి చదును చేశారనే గ్రామస్తుల ఫిర్యాదుతో రంగనాథ్ అక్కడ పరిశీలించారు. ఎన్ఓసీ ఉందని చెప్పిన భూ యజమానిపై హైడ్రా కమిషనర్ సీరియస్అయ్యారు. సంబంధించిన పేపర్లను అధికారులను అందించాలని నిబంధనల ప్రకారం లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. జల సంఘం మాజీ అధ్యక్షుడు వడ్డె నర్సింహులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
