హైదరాబాద్ మణికొండలో.. ప్రభుత్వ భూమి కబ్జా.. 5 ప్లాట్లు కూడా వేశారు.. వెళ్లి బోర్డు పాతిన హైడ్రా !

హైదరాబాద్ మణికొండలో.. ప్రభుత్వ భూమి కబ్జా.. 5 ప్లాట్లు కూడా వేశారు.. వెళ్లి బోర్డు పాతిన హైడ్రా !

రంగారెడ్డి జిల్లా: మణికొండ మున్సిపాలిటీలోని పుప్పాల గూడలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా ఝుళిపించారు. నెమలి నగర్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కబ్జా కోరులు ప్లాట్లు చేశారు. 5 వందల గజాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి 5 ప్లాట్లు చేసి నిర్మాణాలు చేపట్టారు. బుధవారం ఉదయం భారీ బందోబస్తుతో ఈ అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. కబ్జా చేసిన నిర్మాణాలను నేల మట్టం చేసి ప్రభుత్వ బోర్డులు పాతారు. 

హైదరాబాద్‌‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌‌గిరి జిల్లాల్లో ప్రభుత్వానికి అత్యంత విలువైన భూములు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో భూముల రేట్లు కోట్లకు చేరడంతో స్థానిక రాజకీయ నాయకులు, రియల్టర్లు, బిల్డర్లు, కబ్జాదారుల అండతో ప్రభుత్వ స్థలాలను, చెరువులు, కుంటల శిఖం భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు.

సిటీ పరిధిలోనైతే నాలాలు, రోడ్లు, పార్కులు, ఆఖరికి పుట్‌‌పాత్‌‌లను కూడా వదల్లేదు. ఎకరా రూ.100 కోట్లు ఉన్న ప్రాంతాల్లోనూ సర్కార్​ల్యాండ్స్​ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లాయి. వీటిని కాపాడేందుకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, హైడ్రా వంటి సంస్థలు జియో-రిఫరెన్స్‌‌డ్ మ్యాప్‌‌లు, చారిత్రక రికార్డులను ఆధారంగా చేసుకొని న్యాయ పోరాటం చేయాల్సి వస్తున్నది. ఈ ఆక్రమణల వల్ల పర్యావరణానికి, జల వనరులకు పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు కోర్టుల్లో వాదిస్తున్నారు. ఇప్పటికే సిటీలో నాలా, రోడ్లు, పార్కుల కబ్జాతో అధిక వర్షాలు, వరదలతో కాలనీలు జలమయవుతున్న తీరును ఆధారాలతో వివరిస్తున్నారు.