హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ప్రజావాణికి నాలుగు వారాల పాటు విరామం ఇస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. వేలాదిగా వచ్చిన ఫిర్యాదుల్ని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామన్నారు. మిగిలిన వాటిని క్లియర్ చేసేందుకు నాలుగు వారాలు బ్రేక్ఇస్తున్నట్లు తెలిపారు. జూన్ 8 నుంచి యథావిధిగా హైడ్రా ప్రజావాణి కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే, గతంలో ఫిర్యాదులిచ్చిన వారు అత్యవసరమైతే ఆఫీసుకు వచ్చి నేరుగా కలవవచ్చన్నారు.
