V6 News

హైడ్రా ప్రజావాణికి 41 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణికి 41 ఫిర్యాదులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీస్​లో సోమ‌‌‌‌‌‌‌‌వారం నిర్వహించిన ప్రజావాణికి 41 ఫిర్యాదులు వచ్చాయని సంస్థ అడిషన‌‌‌‌‌‌‌‌ల్ డైరెక్టర్ పాప‌‌‌‌‌‌‌‌య్య తెలిపారు. ప‌‌‌‌‌‌‌‌రిశీలించి ప‌‌‌‌‌‌‌‌రిష్కార బాధ్యత‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ను సంబంధిత అధికారుల‌‌‌‌‌‌‌‌కు అప్పగించారు. మేడ్చల్–- మ‌‌‌‌‌‌‌‌ల్కాజిగిరి జిల్లా ఉప్పల్ ఖ‌‌‌‌‌‌‌‌ల్సాలోని ఎక‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌న్నర భూమిని స్థానికులు ఆక్రమించారని, రంగారెడ్డి జిల్లా గండిపేట మండ‌‌‌‌‌‌‌‌లం మ‌‌‌‌‌‌‌‌ణికొండ ముష్కిన్ చెరువుకు ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్ నిర్ధారించకపోవడంతో పైభాగంలో కబ్జాలు చేస్తున్నట్లు పలువురు ఫిర్యాదు చేశారన్నారు. బీహెచ్ఈఎల్ హెచ్ఐజీ ఫేజ్–2, ఉషోదయ ఎన్ క్లేవ్ ప్రాంతంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్క్ ఆక్రమ‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌కు గురవుతోంద‌‌‌‌‌‌‌‌ని, నందనం ట్రీ పార్క్ (పశ్చిమ భాగం) ను గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించి, ప్రహరీ నిర్మించినట్లు కంప్లయింట్స్ చేశారని చెప్పారు.

కలెక్టరేట్​ ప్రజావాణిలో 183 అర్జీలు

కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్​కలెక్టర్ కదిరవన్ పలని ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో అత్యధికంగా ఇండ్ల కోసం 183, పెన్షన్​ కోసం 4, రెవెన్యూ శాఖకు సంబంధించి 41,  ఇతర శాఖలకు  సంబంధించి 18  వచ్చాయన్నారు. వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ర‌‌‌‌‌‌‌‌మేశ్, డీఎంహెచ్ వో వెంకటి, కలెక్టరేట్ ఇన్​చార్జి ఏవో  విజయలక్ష్మి పాల్గొన్నారు.