
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్లో కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. కొండాపూర్‌లోని మాధవ హిల్స్ ఫేజ్-2లో వెయ్యి గజాల పార్కు స్థలంలో చుట్టుపక్కల వాళ్లు గోడలు కట్టి, షెడ్డులు వేశారంటూ హైడ్రా ప్రజావాణికి మాధవాహిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మంగళవారం హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలను తొలగించారు. రూ.11.50 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.