హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో బిగ్‌ రిలీఫ్..

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో బిగ్‌ రిలీఫ్..

హైడ్రా కమిషనర్   రంగనాథ్  కు తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది.  రంగనాథ్ ను  హైడ్రా కమిషనర్  పదవి నుంచి తొలగించాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన  ఉత్తర్వులను  తాత్కాలికంగా సస్పెండ్ చేసింది  డివిజన్ బెంచ్. తదుపరి విచారణను నవంబర్ 3 కు వాయిదా వేసింది. దీంతో రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా కొనసాగేందుకు మార్గం సుగుమం అయింది.

అసలేం జరిగిందంటే.?

లోతుకుంట భూముల వ్యవహారంలో దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా.. హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ ను తొలగించాలంటూ జూలై 27న తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఓ సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించటం సబబేనా అంటూ ప్రశ్నించింది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను తొలగించాలంటూ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది . ఆయన స్థానంలో అర్హత ఉన్న మరో అధికారిని నియమించాలని సూచించింది హైకోర్టు.

►ALSO READ | రూ.20 లక్షలు శాలరీ హైక్ రిజెక్ట్ చేసిన బెంగళూరు టెక్కీ.. ఎందుకో తెలిస్తే షాకే!

ఈ సందర్భంగా హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. కోర్టులు, న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందంటూ తాను దాఖలు చేసిన అఫిడవిట్ లో స్పష్టం చేశారు రంగనాథ్. లోతుకుంట సర్వే నెంబరు 1,2 లోని 40 ఎకరాల్లోకి హైడ్రా వెళ్లలేదని.. పిటిషనర్ అవాస్తవాలు చెబుతున్నారని.. కోర్టు ఆదేశాలు ధిక్కరించలేదని.. న్యాయస్థానాలపై విశ్వాసం, నమ్మకం ఉందని తన అఫిడవిట్ లో స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో ఇవాళ  హైకోర్టులో  విచారణ సందర్భంగా  సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను   డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.