మేడ్చల్లో కబ్జాలపై హైడ్రా కొరడా.. 400 గజాల పార్క్ స్థలం స్వాధీనం

మేడ్చల్లో కబ్జాలపై హైడ్రా కొరడా.. 400 గజాల పార్క్ స్థలం స్వాధీనం

హైదరాబాద్ లో మరో సారి హైడ్రా కొరడా ఝుళిపించింది. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో కబ్జా కోరల నుంచి పార్కు స్థలాన్ని కాపాడింది. 2025, నవంబర్ 7వ తేదీన ఉదయం చౌధరిగూడ గ్రామంలో అక్రమ నిర్మాణాలను కూల్చేవేశారు హైడ్రా అధికారులు. 

పోచారం మున్సిపల్ పరిధి చౌదరిగూడ గ్రామంలో సర్వే నంబర్ 726 ,727 ,729 లో ఉన్న 400 గజాల పార్క్ స్థలాన్ని రియల్టర్లు కబ్జా చేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. పార్కు స్థలాన్ని కాపాడాలని శ్రీనివాస కాలనీ వాసులు హైడ్రాను ఆశ్రయించారు. 

స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన హైడ్రా అధికారులు.. తెల్లవారు జామున కూల్చివేతలు ప్రారంభించారు. హైడ్రా స్పందనకు శ్రీనివాస కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.