బచ్చన్నపేట మండలంలో లేగదూడలపై హైనా దాడి

బచ్చన్నపేట మండలంలో లేగదూడలపై హైనా దాడి

బచ్చన్నపేట, వెలుగు: లేగ దూడలపై హైనాలు దాడి చేస్తుండంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి  జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో బండనాగారం గ్రామంలో మానెపల్లి మల్లయ్య వ్యవసాయ బావి వద్ద  హైనా దాడితో దూడ మృతి చెందింది. 

రైతు పాడి గేదెలను వ్యవసాయ బావి వద్ద దొడ్డిలో కట్టేసి ఇంటికి వచ్చాడు. ఆదివారం తెల్లవారు జామున వెళ్లేసరికి దూడ మృతి చెందింది.  రెండు నెలల కింద పరిసర గ్రామాల్లో  హైనా దాడిలో పలువురు రైతులకు చెందిన దూడలు మృతి చెందాయి.