ఇండియాలో హ్యుందాయ్ విస్తరణ.. రూ.45 వేల కోట్ల పెట్టుబడికి రెడీ

ఇండియాలో హ్యుందాయ్ విస్తరణ.. రూ.45 వేల కోట్ల పెట్టుబడికి రెడీ
  • ఇండియా విభాగం 
  • కొత్త సీఈఓగా తరుణ్​ గార్గ్
  • 2027లో జెనెసిస్ ​బ్రాండ్​ ఎంట్రీ
  • ప్రకటించిన హ్యుందాయ్

ముంబై: దక్షిణ కొరియా ఆటో కంపెనీ హ్యుందాయ్ మోటార్స్​ 2030 ఆర్థిక సంవత్సరం నాటికి మనదేశంలో రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.  తరుణ్​ గార్గ్​ను ఇండియా విభాగానికి ఎండీ, సీఈఓగా నియమించింది. కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ జోస్​ మునోజ్ ఢిల్లీలో బుధవారం 2030 రోడ్​మ్యాప్​ను ప్రకటించారు.  సేల్స్,​ ఫైనాన్స్​ విభాగం హ్యుందాయ్​ క్యాపిటల్ 2026 రెండో క్వార్టర్ నాటికి దశలవారీగా భారత్​లోకి ప్రవేశిస్తుంది.  లగ్జరీ బ్రాండ్​ జెనెసిస్ కూడా 2027 నాటికి మార్కెట్​లోకి వస్తుంది.

 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 26 కొత్త ప్రొడక్టులను విడుదల చేస్తారు. వీటిలో ఎంపీవీ, ఆఫ్​-రోడ్,​ ఎస్​యూవీ, ఈవీలు ఉంటాయి.  ఎగుమతుల వాటాను 30 శాతం వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనోజ్​ తెలిపారు.  2030 గ్రోత్​ రోడ్​మ్యాప్​లో భాగంగా, హెచ్​ఎంఐఎల్​ తమ ఆదాయాలను 1.5 రెట్లు పెంచి, రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాలని టార్గెట్​ విధించుకుంది. 

రూ.45 వేల కోట్ల పెట్టుబడిలో 60 శాతం మొత్తాన్ని ఆర్ అండ్​ డీ కోసం, మిగిలిన 40 శాతం సామర్థ్యం పెంపు, అప్​గ్రేడేషన్​కోసం ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. 2030 నాటికి దేశీయ మార్కెట్​ వాటాను 15 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.