నేను లెస్బియన్‌ ని : ద్యుతీచంద్‌

నేను లెస్బియన్‌ ని : ద్యుతీచంద్‌

తాను స్వలింగ సంపర్కురాలినంటూ ఇండియా ఫాస్టెస్ట్‌‌ ఉమెన్‌‌ ద్యుతీ చంద్‌‌ సంచలన ప్రకటన చేసింది. ఈ విషయం తెలిసిన తర్వాత కుటుంబం నుంచి బహిష్కరిస్తామని తన సోదరి బెదిరిస్తున్నదని ఆరోపించింది. ‘మా గ్రామానికే  (ఒడిసాలోని జైపూర్‌‌ జిల్లా) చెందిన 19 ఏళ్ల అమ్మాయితో నాకు ఐదేళ్లుగా రిలేషన్‌‌షిప్‌‌ ఉంది. తను మా బంధువుల అమ్మాయే. ప్రస్తుతం భువనేశ్వర్‌‌ కాలేజ్‌‌లో ఆమె బీఏ సెకండియర్‌‌ చదువుతోంది. నేను మా ఊరికి వచ్చినప్పుడు నాతో కలిసే ఉంటుంది. ఈ సమయంలో ఆమె పేరు బయటపెట్టలేను. తను నా సోల్‌‌మెట్‌‌. తనతోనే జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నా. ఈ విషయం తెలిసిన అమ్మానాన్న నాకు అడ్డు చెప్పలేదు. కానీ మా పెద్ద అక్క ఇంటి నుంచి వెలేస్తానని బెదిరిస్తున్నది. ఆ అమ్మాయి ఆస్థి కోసమే వెంటపడుతోందని, పద్ధతి మార్చుకోకపోతే జైల్లో పెట్టిస్తానని అంటోంది.  వదిన నచ్చకపోవడంతో మా అన్న కుటుంబాన్ని అక్క ఇంటి నుంచి తరిమేసింది. అవసరమైతే మేం పెళ్లి కూడా చేసుకుంటాం. . వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు’ అని హైదరాబాద్‌‌లో ప్రాక్టీస్‌‌ చేస్తున్న ద్యుతీ పేర్కొంది.