V6 News

వందకు పైగా లొకేషన్స్‌‌‌‌లో..ఐయామ్ గేమ్ మూవీ షూట్..

వందకు పైగా లొకేషన్స్‌‌‌‌లో..ఐయామ్ గేమ్ మూవీ షూట్..

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ,  జోమ్ వర్గీస్ కలిసి నిర్మిస్తున్న చిత్రం   ‘ఐయామ్ గేమ్’.  నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన  ఈ కథను షాబాస్ రషీద్,  ఆదర్శ్ సుకుమారన్ సంయుక్తంగా రచించారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని అప్‌‌‌‌డేట్ ఇచ్చారు మేకర్స్.   సౌత్ ఇండియాలోని  100కి పైగా లొకేషన్స్‌‌‌‌లో    సుమారు 156 రోజుల పాటు చిత్రీకరించామని తెలియజేశారు. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 40వ చిత్రమిది.  

ఆయన  కెరీర్‌‌‌‌లోనే అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాస్ గెటప్‌‌‌‌లో కనిపించనున్నాడు. ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు, -దర్శకుడు మిస్కిన్, కయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ,  తమిళ నటి సంయుక్త విశ్వనాథన్  కీలక పాత్రలు పోషిస్తున్నారు.  జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, అన్బరివ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలుగు,  మలయాళ, తమిళ,  హిందీ, కన్నడ భాషలలో ఆగస్టులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.