
- నరేశ్‌ను సన్మానించిన కాలేజీ కరస్పాండెంట్ సరోజా వివేక్
ముషీరాబాద్, వెలుగు: కాకా డాక్టర్‌బీఆర్ అంబేద్కర్‌లా కాలేజీలో చదవడం తన అదృష్టమని జూనియర్ సివిల్‌జడ్జిగా ఎంపికైన పి.నరేశ్అన్నారు. ఇటీవల విడుదలైన జూనియర్‌సివిల్‌జడ్జి ఫలితాల్లో ఎంపికైన స్టూడెంట్నరేశ్ నుసోమవారం బాగ్‌లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నరేశ్మాట్లాడుతూ.. 2017 నుంచి 2022 వరకు అంబేద్కర్‌లా కాలేజీలో బీఏ ఎల్ఎల్ బీ చదవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
మంచి బోధనతోపాటు స్టడీ మెటీరియల్, గైడెన్స్అందించారని, టార్గెట్రీచ్అయ్యేలా ఎంతో ప్రోత్సాహం అందించారని చెప్పారు. అండగా నిలిచిన కాలేజీ ఫ్యాకల్టీ, యాజమాన్యం, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కరస్పాండెంట్ సరోజా వివేక్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌లా కాలేజీ స్టూడెంట్నరేశ్47వ ర్యాంక్‌తో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికవ్వడం సంతోషకరమన్నారు.
లా అనేది బాధ్యత కలిగిన ఉన్నతమైన స్థానమన్నారు. ఇలాంటి ఆణి ముత్యాలకు ఉన్నతమైన చదువును అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. నరేశ్‌లాంటి మట్టిలో మాణిక్యాలు మరెన్నో వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ లింబాద్రి, జాయింట్ సెక్రెటరీ రమణ కుమార్, కాలేజీ డైరెక్టర్ వై.విష్ణుప్రియ, ప్రిన్సిపల్ సృజన, టీచింగ్ నాన్, టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్లు పాల్గొన్నారు.