బీజేపీ తప్ప.. ఏ పార్టీతోనైనా పొత్తుకు రెడీ

V6 Velugu Posted on Jan 22, 2022

యూపీ సీఎం అభ్యర్థి తను కాదని స్పష్టం చేశారు ప్రియాంక గాంధీ. అందరూ పదే పదే అదే ప్రశ్న అడిగే సరికి అంతటా నన్నే చూస్తారని... చికాకులో చెప్పానన్నారు ప్రియాంక. 80 పర్సెంట్ వర్సెస్ 20 పర్సెంట్ అని సీఎం యోగి అంటున్నారు... కానీ.. వాస్తవం మాత్రం 99 పర్సెంట్ వర్సెస్ వన్ పర్సెంట్ అన్నారు. యూపీ సహా... దేశంలో కేంద్రంలో సన్నితంగా ఉండే వారు... బడా వ్యాపారవేత్తలు మాత్రమే.. లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రజలందరూ కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. యూపీలో నిరుద్యోగుల శాతం గురించి ఎందుకు మాట్లడట్లేదు... విద్యారంగంపై యూపీ కేటాయిస్తున్న బడ్జెట్ గురించి ఎందుకు మాట్లడట్లేదని ప్రశ్నించారు. యూపీ సమస్యలపై కాకుండా... అనవసరమైన ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారన్నారు ప్రియాంక. UP ఎన్నికల తర్వాత పొత్తుల గురించి స్పందించారు. బీజేపీ తప్ప... అన్ని పార్టీలను కాంగ్రెస్ స్వాగతిస్తుందన్నారు ప్రియాంక..

 

Tagged Bjp, Priyanka Gandhi, CM face CongressUttar Pradesh elections

Latest Videos

Subscribe Now

More News