స్కూల్ వదిలి పారిపోయిన విద్యార్థిని

స్కూల్ వదిలి పారిపోయిన విద్యార్థిని

అశ్వారావుపేట, వెలుగు:  ‘తోటి పిల్లల బ్యాగుల్లో బిస్కెట్లు నువ్వే తింటున్నావ్. అందరి బుక్స్​ చింపుతున్నావ్​’ అని ఓ ఎస్​ఎస్​సీ స్టూడెంట్​ను పదే పదే స్కూల్​ సిబ్బంది అనుమానిస్తుండడంతో మనస్తాపానికి గురైన ఆమె హాస్టల్ విడిచి పారిపోయింది. 4 కిలోమీటర్లు నడుకుంటూ వెళ్లి తెల్లారిన తర్వాత ఎవరైనా చూస్తారేమోనని ఓ పొలంలో దాక్కుంది. ఓ రైతు ఫోన్ ​తీసుకుని తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం రామనర్సయ్య నగర్ కు చెందిన  ఓ బాలిక అశ్వారావుపేటలోని మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ గురుకుల స్కూల్​లో పదో తరగతి చదువుతోంది. తోటి పిల్లల పుస్తకాలు చింపుతున్నావని, ఇతర విద్యార్థుల బ్యాగుల్లో బిస్కెట్లు దొంగతనం చేసి తింటున్నావని స్కూల్ ​సిబ్బంది ఆమెను మాటలంటున్నారు. ఎప్పుడూ ఇలాగే సతాయిస్తుండడంతో విసుగు చెందింది. ఎట్టి పరిస్థితుల్లో స్కూల్​లో ఉండొద్దని నిర్ణయించుకుని మంగళవారం తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉండగా హాస్టల్ ​కిటికీ నుంచి దూకి పారిపోయింది. ఉదయం అటెండెన్స్ వేస్తుండగా బాలిక కనిపించకపోవటంతో పేరెంట్స్​కు సమాచారమివ్వగా, వారు పీఎస్​లో కంప్లయింట్​ఇచ్చారు. ఈలోగా ఆమె నడుచుకుంటూ అశ్వారావుపేట మండలం గుర్రాల చెరువు వద్ద పంట పొలాల దగ్గరకు వెళ్లింది. తెల్లారడంతో ఎవరైనా చూస్తారేమోనని, మళ్లీ స్కూల్​కు తీసుకువెళ్తారని పొలాల్లో దాక్కొంది. అటుగా వచ్చిన ఓ రైతు ఫోన్ తీసుకొని తల్లిదండ్రులకు కాల్​చేసి చెప్పింది. దీంతో పేరెంట్స్​ ఇందు దగ్గరకు వెళ్లి ఆమెను తీసుకొని స్కూల్​కు వెళ్లారు. తమ కూతురిపై లేనిపోని ఆరోపణలు చేసి మానసికంగా వేధించారని ఆందోళన చేశారు. దీంతో ఎస్​ఐ అరుణ ఏదైనా సమస్య ఉంటే కంప్లయింట్​ ఇవ్వాలని కోరారు. తర్వాత సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.