రూ. 30 కోట్ల సింగరేణి నిధులు తెప్పించే బాధ్యత నాది : గడ్డం వంశీ కృష్ణ

రూ. 30 కోట్ల సింగరేణి నిధులు తెప్పించే బాధ్యత నాది : గడ్డం వంశీ కృష్ణ

దివంగత కాకా వెంకట స్వామికి కార్మికులంటే ఎనలేని ప్రేమ అని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. లేబర్ నాయకుడిగా కార్మిక సమస్యలపై పోరాడిన యోధుడు కాకా అని  చెప్పారు. రామగుండం సింగరేణి ఏరియా ఓసిపి 3 కృషి భవన్ లో కాంగ్రెస్ పార్టీ, ఐ.ఎన్.టి.యు.సీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాయి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు రాష్టాన్ని పాలించిన బీఆర్ఎస్ అప్పుల పాలు చేసి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపారని చెప్పారు.

సింగరేణి నష్టంలో ఉన్నప్పుడు వడ్డీలేని రుణాన్ని తీసుకువచ్చి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి అని తెలిపారు. గత పది సంవత్సరాలుగా సింగరేణిలో ఒక కొత్త బావి ప్రారంభించలేదని విమర్శించారు. సంస్థను ప్రైవేటుపరం చేసే కుట్రలను తిప్పి కొట్టాలని తెలిపారు. సింగరేణి సంస్థకు రావలసిన రూ. 30 కోట్ల బకాయిలను చెల్లించాలని కోరారు.

రూ. 30 కోట్ల సింగరేణి నిధులు తెప్పించే బాధ్యత తనదని చెప్పారు. సింగరేణిలో కొత్త బావులను నెలకొల్పుతామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తామని కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పారు. ఎంపీగా అవకాశం కల్పిస్తే కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గడ్డం వంశీ కృష్ణ తెలిపారు.