
జాతిరత్నాలు సినిమాతో ఫరియా అబ్దుల్లా( Faria Abdullah) క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇప్పుడిదే ఆమెను చిక్కుల్లో పడేసినట్టు తెలుస్తోంది. చిట్టిగా అలరించిన తర్వాత ఫరియా పలు సినిమాల్లో మెరిసింది. అవేవీ తనకు సరైన సక్సెస్‌ను ఇవ్వలేకపోయాయి. దీంతో ఇప్పుడు ఈ చిన్నది ఓటీటీ బాట పట్టింది.
ఇదిలా ఉంటే ఇటీవల ఈ హీరోయిన్ ఇంటర్వ్యూ ఒకటి వైరలవుతోంది. ఎప్పుడూ చలాకీగా కనిపించే ఫరియా తనను తాను ఓ బాలీవుడ్ హీరోతో పోల్చుకుంది. రణ్వీర్ సింగ్‌కు తాను ఫీమేల్ వర్షన్ అంటూ తెలిపింది. దీపికా పదుకునే(Deepika Padukone) కన్నా తానే ఈ హీరోకి ఎక్కువగా రిలేట్ అవుతానని తెలిపింది.
ఇక ఫరియా నటించిన ది జెంగబూర్ కర్స్(The Jengaburu Curse) అనే సిరీస్ విడుదలకు సిద్ధమైంది. రేపటి నుంచే (Aug9) సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌పైనే ఫరియా తన ఆశలన్నీ పెట్టుకుంది.