ఇకపై ఇలాంటి పొరపాట్లు చేయను. క్షమించండి: ఛార్మీ

ఇకపై ఇలాంటి పొరపాట్లు చేయను. క్షమించండి: ఛార్మీ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఢిల్లీకి, తెలంగాణ కు కూడా వచ్చింది. ఆ వైరస్ బారిన పడి ప్రపంచమంతటా ఎంతోమంది చావు బ్రతుకులమధ్య కొట్టుకుంటుంటే హీరోయిన్ చార్మీ ఎటకారంగా టిక్ టాక్ వీడియో చేసి పోస్ట్ చేసింది. “కరోనా వచ్చేసిందంట.. నేను ఇప్పుడే వార్తల్లో చూసాను  అల్ ది బెస్ట్” అంటూ వెటకారంగా ఓ నవ్వు నవ్వి పోస్ట్ చేసిన వీడియోని చూసి నెటిజన్లు చార్మీ పై ఫైర్ అవుతున్నారు.

ఓ వైపు కరోనా వైరస్ కారణంగా  ప్రజలంతా బిక్కుబిక్కు మంటుంటే ఓ సెలిబ్రిటీ అయుండి ఇలాంటి వీడియోలు పెడుతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టిక్ టాక్ లో వెంటనే ఆ పోస్టును తొలగించి,  తర్వాత ట్విట్టర్ లో జరిగిన దానిపై క్షమాపణలు కోరింది.

“ఆ వీడియో పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పోస్టయిన అన్ని కామెంట్లు చదివాను. ఎంతో సున్నితమైన అంశంపై పరిణతి లేకుండా స్పందించినందుకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. ఇకపై ఇలాంటి పొరబాట్లు జరగకుండా జాగ్రత్త వహిస్తాను” అంటూ ట్వీట్ చేసింది.