నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా : పవిత్రోత్సవంలో భాగమైన సైనా

నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా : పవిత్రోత్సవంలో భాగమైన సైనా

రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుక కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ మహోత్తరమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. అందులో స్టార్ భారత షట్లర్ సైనా నెహ్వాల్ కూడా ఉన్నారు. పవిత్రోత్సవానికి ఒకరోజు ముందు సైనా ఆలయ పట్టణానికి చేరుకుంది. అతిథుల జాబితాలో తానూ చేరడం అదృష్టంగా భావిస్తున్నానని, పవిత్ర ఆలయంలో శ్రీరాముని దర్శనం చేసుకుంటానని సైనా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

ఈ వేడుకలో పాల్గొంటున్న సైనా ఆనందంతో పొంగిపోయారు. ఇది మనందరికీ గొప్ప రోజుని అనుకుంటున్నానని చెప్పారు. ఈ రోజు ఇక్కడ ఉండే అవకాశం లభించడం తన అదృష్టమన్న ఆమె.. ఈ క్షణం కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నానని తెలిపారు. తాను తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానని కూడా అని సైనా పేర్కొంది.  

అయోధ్యలోని పవిత్ర దేవాలయంలో మరి కొంత సేపట్లో పవిత్రమైన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. కావున ఈ రోజును భక్తులందరూ ఓ ప్రత్యేకమైన రోజుగా.. చారిత్రాత్మక సంఘటనగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యానికి ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది అతిథులు ఇప్పటికే అయోధ్యకు వచ్చారు. డి-డేలో పలువురు క్రీడా ప్రముఖులు ఆలయ పట్టణానికి చేరుకుంటున్నారు. అందులో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, PT ఉష, సైనా వంటి వారితో పాటు వివిధ రంగాలకు చెందిన క్రీడా ప్రముఖులు పవిత్ర వేడుకలో చేరడానికి ఆహ్వానం అందింది.