ఫస్ట్ టైమ్ ఓటేశా.. వెరీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్

ఫస్ట్ టైమ్ ఓటేశా.. వెరీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్

రాజేంద్రనగర్ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐశ్వర్య అనే యువతి ఓటు గల్లంతయ్యింది. 22 వ వార్డులోని బూత్ నెంబర్ 17 లో మొదటి సారి ఓటు వేయడానికి వచ్చిన ఐశ్వర్యకు తనకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ పై అంతకు ముందే సిరా గుర్తు వేసి ఉండడంతో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పేపర్ నిబంధనల ప్రకారం లేదని పోలింగ్ అధికారులకు తెలిపింది. అధికారులు మాత్రం ఏం ఫర్వాలేదని, స్టాంప్ వేస్తే ఆ ఓటు చెల్లుతుందని చెప్పి తనతో బలవంతంగా ఓటు వేయించారని ఆమె మీడియాకు తెలిపింది. ఆ సిరా గుర్తు ‘కారు గుర్తు’పై ఉందని, మాకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసినా ఆ ఓటు చెల్లకుండా పోయిందని ఐశ్వర్య తెలిపింది. మొదటిసారిగా ఓటు వేశా.. కానీ ఇదొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్  అంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది

ఇలాంటి ఓటు చెల్లుతుందా?

ఈ విషయంపై పోలింగ్ అధికారులను మీడియా ప్రశ్నించగా.. స్వస్తిక్ మార్క్ ఉన్న చోటనే ఆ ఓటును పరిగణలోకి తీసుకుంటామని, సదరు ఓటర్ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను అసిస్టెంట్ ఎలక్షన్ కమీషనర్ అని, ఓటింగ్ కౌంటింగ్  సమయంలో కూడా తానే విధులు నిర్వహిస్తానని, ఆ ఓటుని గుర్తిస్తానని తెలిపాడు. సదరు ఓటరే ఆ ఓటు వేశారని ఎలా గుర్తించగలరని అడిగిన ప్రశ్నకు తడబడుతూ సమాధానమిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.