ఆర్సీబీకి ఆడాలనుకోలేదు... 2022 వేలంలో కొనుగోలు చేయనందుకు బాధపడ్డా: రజత్

ఆర్సీబీకి ఆడాలనుకోలేదు... 2022 వేలంలో కొనుగోలు చేయనందుకు బాధపడ్డా: రజత్
  • కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నా

బెంగళూరు: ఐపీఎల్‌‌‌‌ 2022 మెగా వేలంలో తనను తీసుకుంటామని చెప్పిన రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంగళూరు తీసుకోకపోవడంతో చాలా బాధగా అనిపించిందని కెప్టెన్ రజత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటీదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. దీంతో ఇక ఎప్పుడూ ఆర్సీబీకి ఆడాలనుకోలేదన్నాడు. ‘2022 మెగా వేలానికి ముందు ఆర్సీబీ నుంచి నాకు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. వేలంలో తీసుకుంటున్నాం. రెడీగా ఉండమని చెప్పారు. దీంతో బెంగళూరుకు ఆడతాననే సంతోషంలో మునిగిపోయా. కానీ వేలంలో వాళ్లు నన్ను తీసుకోలేదు. దాంతో నేను ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడుతూ కాలం గడిపాను. మరో రోజు ఆకస్మాత్తుగా అదే ఫ్రాంచైజీ నుంచి కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. 

గాయపడిన లవ్నీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిసోడియా ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీసుకుంటామని చెప్పారు. కానీ ఆ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాకు ఆర్సీబీకి వెళ్లాలనిపించలేదు. ఎందుకంటే ఇంజ్యురీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెళ్తే తుది జట్టులో ఆడే అవకాశం రాదు. డగౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం లేదు. వేలంలో తీసుకోలేదుగానీ, ప్రత్యామ్నాయంగా తీసుకుంటామని చెప్పేసరికి చాలా కోపం వచ్చింది. కాసేపటి తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చేశా’ అని ఆర్సీబీ పాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రజత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. 

ఒత్తిడికి లోనయ్యా..

కోహ్లీ నుంచి సారథ్యం స్వీకరించినప్పుడు చాలా ఒత్తిడికి లోనయ్యాయని రజత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నాడు. అయితే విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన మద్దతు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. ‘టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా మంది పెద్ద ప్లేయర్లు ఉన్నారు. విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నా కెప్టెన్సీలో ఆడటమా? అని ఆందోళన మొదలైంది. కానీ ఈ విషయంలో కోహ్లీ మద్దతుగా నిలిచాడు. అతని నుంచి చాలా నేర్చుకున్నా. ఎందుకంటే బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అయినా, వ్యక్తిత్వంలోనైనా విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎవరూ సాటిరారు. ఆయన అనుభవం, ఆలోచనలు ఎవరికీ లేవు. బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యేందుకు నాకు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చాడు. 

వాటిని ఇప్పటికీ అమలు చేస్తున్నా’ అని రజత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరించాడు. ఆర్సీబీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంపికైన రోజు తన జీవితంలోనే అత్యంత చిరస్మరణీయమైందన్నాడు. ‘నేను టీవీ చూడటం మొదలుపెట్టినప్పట్నించి కోహ్లీ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాడు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇండియా టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సారథ్యం వహిస్తూనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి నుంచి నేను కెప్టెన్సీ ప్లాకూ తీసుకోవడం చాలా ఆందోళన కలిగించింది. అది నాకు ఇస్తూ పట్టుకొమ్మని చెప్పాడు. 

నేను పట్టుకున్నా.. కానీ అతని వైపే చూస్తూ ఉండిపోయా. దీన్ని నేను ఏం చేయాలి అని అడిగా. అప్పుడు కెప్టెన్సీకి నువ్వు అర్హుడివి. దాన్ని నువ్వు సంపాదించుకున్నావు అని రెండు మాటలు చెప్పాడు. అప్పుడు కాస్త కుదుటపడ్డా. ఆ క్షణాలు నాకు చాలా ప్రత్యేకంగా అనిపించాయి’ అని రజత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించాడు.