నా మన్ కీ బాత్ చెప్పేందుకు రాలే

నా మన్ కీ బాత్ చెప్పేందుకు రాలే

మీ కష్టాలు తెలుసుకునేందుకు వచ్చా

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ‘‘నా మన్ కీ బాత్ చెప్పేందుకు రాలేదు. మీ కష్టాలను విని అర్థం చేసుకునేందుకు, వాటిని పరిష్కరించేందుకే వచ్చా’’ అని తమిళనాడు ప్రజలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తమిళనాడులోని ఈరోడ్ లో ఆదివారం ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా రిపబ్లిక్ డే రోజున రైతులు ర్యాలీ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతులకు చెందిన వాటిని లాక్కోవాలని చూస్తున్నందుకే వారు ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా కంట్రోల్ చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. తమిళనాడు లాంగ్వేజ్, కల్చర్, హిస్టరీని మోడీ అర్థం చేసుకోలేదన్నారు. రాష్ట్రంలో 3 రోజుల ప్రచారాన్ని కోయంబత్తూర్​లో ప్రారంభించారు. రైతులు, కార్మికులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. కోయంబత్తూర్, ఈరోడ్ లతో పాటు తిరుపూర్, కరూర్, దిండిగల్ జిల్లాల్లో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.

పెట్రోల్ ధరల పెరుగుదలపై ఫైర్

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ప్రజలు ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ కలెక్షన్లలో బిజీగా ఉందని ఆయన ఆదివారం ట్విట్టర్ లో విమర్శించారు. ‘‘మోడీజీ జీడీపీ (గ్యాస్, డీజిల్, పెట్రోల్) ధరల విషయంలో అద్భుతమైన వృద్ధిని సాధించారు’’ అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి..

ఉత్తరాఖండ్​కు.. ఒక్కరోజు సీఎంగా కాలేజీ అమ్మాయి

తబలా కొట్టి..రికార్డు పట్టి..!

చదలవాడ హేమేశ్​కు బాల పురస్కార్