
అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అహింస’. పి.కిరణ్ నిర్మించిన ఈ మూవీతో గీతికా తివారీ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. జూన్ 2న సినిమా విడుదలవుతున్న సందర్భంగా గీతిక మాట్లాడుతూ ‘‘కొత్త వారిని పరిచయం చేయడంలో లక్కీ హ్యాండ్ అయిన తేజ గారి సినిమాతో లాంచ్ అవడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో నా పాత్ర పేరు అహల్య. అమాయకత్వం నుంచి స్ట్రాంగ్ అండ్ పవర్ ఫుల్‌గా ఎదిగే పాత్ర. ప్రేమపై తనకు నమ్మకం ఎక్కువ. చాలా కష్టాలు ఎదుర్కొంటుంది. క్యారెక్టర్ చాలెంజింగ్‌గా అనిపించింది. కల్చర్, నేచర్‌తో కనెక్ట్ అయ్యే సినిమా ఇది. చక్కని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. అభిరామ్ మల్టీ టాలెంటెడ్. చాలా హార్డ్ వర్క్ చేశాడు. తొంభై శాతం షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని ఫారెస్ట్‌లో జరిగింది. ఓ నటిగా ఒక్క జానర్ కి పరిమితం కాకుండా అన్నిరకాల సినిమాలు, పాత్రలు చేయాలని వుంది”అని చెప్పింది.