V6 News

గేదెల రాజు కోసం 12 కేజీల బరువు పెరిగా: రఘుకుంచే

గేదెల రాజు కోసం 12 కేజీల బరువు పెరిగా: రఘుకుంచే

రఘుకుంచే లీడ్ రోల్లో చైతన్య మోటూరి తెరకెక్కించిన చిత్రం 'గేదెల రాజు'. వాణి రవికుమార్ మోటూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 24న సినిమా రిలీజ్ సందర్భంగా రఘు కుంచె మాట్లాడుతూ 'గేదెల రాజు క్యారెక్టర్ను దర్శకుడు రాసుకున్న విధానం చూశాక నాకే వాడిని చం పాలనేంత కోపం వచ్చింది. అయితే ఆ పాత్ర చూడగానే భయపెట్టేలా ఉండాలి.. అందుకోసం 12 కేజీల బరువు పెరిగాను. గోదావరి జిల్లా వాడిని కనుక ఆ యాస మాట్లాడటం సులువైంది. 

సినిమా చూసిన వాళ్లంతా మాస్ అప్పీల్తో బాగుందని చెప్పారు. ఫిష్ మార్కెట్ లాంటి రియల్ లొకేషన్స్లో లో షూట్ చేశాం. ఇంటర్వెల్ ఫైట్ ఆకర్షణగా నిలు స్తుంది. అందులో డూప్ కత్తులు దొరక్క నిజం కత్తులు వాడారు. అవి ఎక్కడ ఎవరికి తగులుతా యో అని భయమేసింది. ఫుల్ లెంగ్త్ రోల్ కనుక సబ్జెక్ట్పై ఉన్నకమాండ్ మ్యూజిక్ చేసేప్పుడు హెల్ప్ అయింది. బీజీఎం నేచురల్గా కుదిరింది. 

పాటలు కూడా సిచ్యువేషనల్గా ఉంటాయి. సినిమా పట్ల దర్శకుడి ప్యాషన్ చూసి ప్రజెంటర్లో ప్రొడక్షన్లోనూ భాగమయ్యాను. ఇక నటుడిగా విలన్ పాత్రల్లోనే నటించాలి అనుకోవడం లేదు. అవకాశాలను బట్టి ముందుకెళ్తా. పయనం, రచయిత కల్యాణ చక్రవర్తి తీస్తున్న సినిమాతో పాటు అల్లరి నరేష్ గారిసినిమాలోనూ ఒక మంచి రోల్ చేస్తున్నా' అని చెప్పారు.