రిటైర్మెంట్ ప్రకటించలేదు.. అదంతా అబద్దం : మేరీకోమ్

రిటైర్మెంట్ ప్రకటించలేదు.. అదంతా అబద్దం : మేరీకోమ్

భారత బాక్సింగ్ లెజెండ్ మేరీకోమ్ తాను ఇంకా బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశారు. తనను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించారు. అన్ని కేటగిరీల నుంచి తప్పుకుంటున్నట్టు వచ్చిన పలు మీడియాల్లోని వార్తలను మేరీకోమ్ పూర్తిగా ఖండించారు.

తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని, తనపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని మేరీకోమ్ చెప్పారు. అలాంటి సందర్భమే వస్తే తాను వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చి.. రిటైర్మెంట్ ప్రకటిస్తానన్నారు. దాంతో పాటు అని కేటగిరీల నుంచి కూడా తాను తప్పుకున్నట్టు కొన్ని మీడియాలు కథనాలు ఇచ్చాయని.. కానీ అది నిజం కాదని మేరీకోమ్ తేల్చి చెప్పేశారు..

దిబ్రూఘర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భారతీయ పుజిలిస్ట్ ఆట నుండి రిటైర్మెంట్ ప్రకటించినట్లు పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఆమె తాజాగా తన ప్రకటనను స్పష్టం చేసింది. తాను జనవరి 24, 2024న డిబ్రూగఢ్‌లో ఒక పాఠశాల ఈవెంట్‌కు హాజరై.. పిల్లలను ప్రోత్సహిస్తానని చెప్పానన్నారు. తనకు ఇప్పటికీ క్రీడలలో సాధించాలనే కోరిక ఉందని, కానీ ఒలింపిక్స్‌లో వయోపరిమితి తనను పాల్గొనడానికి అనుమతించదని చెప్పారు. అయినప్పటికీ నేను తన పనిని కొనసాగించగలనన్నారు. తాను ఇప్పటికీ ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నానని.. రిటైర్మెంట్ ప్రకటించాలనుంటే అందరికీ తెలియజేస్తానని మేరీ కోమ్ తెలిపారు.