ఆర్యన్ కేసు నుంచి నన్ను తొలగించలే.. ఇది నేనే కోరా

ఆర్యన్ కేసు నుంచి నన్ను తొలగించలే.. ఇది నేనే కోరా

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు దర్యాప్తును ముంబై ఎన్సీబీ ఆఫీసర్ సమీర్‌‌ వాంఖడే నుంచి ఢిల్లీ సెంట్రల్ యూనిట్ అధికారికి బదిలీ చేస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డీజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సమీర్‌‌ వాంఖడే ఆధ్వర్యంలోని ఎన్సీబీ ముంబై జోన్ ఆర్యన్ ఖాన్  కేసును దర్యాప్తు చేస్తుండగా.. ఇకపై ఎన్సీబీ సెంట్రల్ యూనిట్  దర్యాప్తు చేపట్టనుంది. వాంఖడేను తప్పించిన క్రమంలో ఇకపై ఎన్సీబీకి చెందిన ప్రత్యేక బృందం... ఆర్యన్ ఖాన్ వ్యవహారంతో సహా సంబంధం ఉన్న మొత్త 6 కేసుల విచారణను సెంట్రల్ యూనిట్ కు బదలాయించారు. ఎన్సీబీ అధికారి సంజయ్ సింగ్  ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు (సిట్) టీం విచారించనుంది. సమీర్ వాంఖడేపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన సమీర్‌‌.. తనను తొలగించలేదని, ఈ కేసు దర్యాప్తు సెంట్రల్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరగాలని తానే కోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. ఇక ఈ కేసును ఎన్సీబీ ఢిల్లీ టీమ్‌ ఎంక్వైరీ చేస్తుందన్నారు. ఇది ఢిల్లీ, ముంబై ఎన్సీబీ టీమ్స్ మధ్య కోఆర్డినేషన్‌ అని సమీర్ తెలిపారు.