‘మేం ఫేమస్’ అంటూ మొదటి చిత్రంతోనే పాపులారిటీ అందుకున్న సుమంత్ ప్రభాస్ నుంచి రాబోతున్న రెండో సినిమా ‘గోదారి గట్టుపైన’. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభినవ్ నిర్మించారు. మే 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ చెప్పిన విశేషాలు.
‘‘నా మొదటి మూవీ తెలంగాణ రూరల్ స్టోరీ కాగా ఇది గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సూపర్ క్యూట్ ఫిల్మ్. గోదావరి యాసలో నటించడం మరింత ఎక్సయిటింగ్‌గా అనిపించింది. నేను పుట్టిపెరిగింది తెలంగాణలో కావడంతో గోదావరి యాస కోసం నాలుగు నెలలు రిహార్సల్స్ చేశాను. ఇందులో నాది ఇన్సోసెంట్ ఆటో డ్రైవర్ పాత్ర. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి విలువ ఇచ్చే పాత్ర. ఇందులో ఆటో రేస్ కూడా ఉంటుంది.
దాని కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశా. నా క్యారెక్టర్‌లో ఫన్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. జగపతి బాబు గారు, నిధి పాత్రలు చాలా బలంగా ఉంటాయి. వారి ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా ఉంటాయి. నిధి తెలుగు నేర్చుకుని చాలా బాగా నటించింది. జగపతిబాబు గారు, లైలా గారి కాంబినేషన్ కొత్తగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ వైబ్‌తో ఉంటుంది. దేవి ప్రసాద్ నా ఫాదర్ క్యారెక్టర్ చేశారు.
ఇందులో చూపించిన లవ్, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. నాగవంశీ కంపోజ్ చేసిన పాటలకు మంచి బజ్ వచ్చింది. నిర్మాత అభినవ్ ఫ్రెండ్లీగా ఉంటూ మాకు చాలా కంఫర్ట్ ఇచ్చారు. మూడేళ్ల తర్వాత నా నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఆడియెన్స్‌కు బాగా రీచ్ కావాలని డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తున్నాం. ఇకపై గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నా’’.
