నటి రాఖీ సావంత్ తల్లి జయ సావంత్ మృతి

నటి రాఖీ సావంత్ తల్లి జయ సావంత్ మృతి

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తల్లి జయ సావంత్ కన్నుమూశారు. కొంతకాలంగా ఎండ్రోమెట్రియల్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె.. శనివారం (జనవరి 28) ముంబయి జుహు ప్రాంతంలోని సిటీ కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాఖీ సావంత్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తాను తన తల్లిని మిస్ అవుతున్నాననంటూ భావోద్వేగ పోస్టును షేర్ చేసింది. దాంతో పాటు తన తల్లి బెడ్ పై ఉండగా.. రాఖీ సావంత్ కింద కూర్చొని ఏడుస్తూ ఉండడం అందర్నీ కలచివేస్తోంది. దీంతో పలువురు బాలీవుడ్ నటుడు జయ సావంత్ కు సంతాపం తెలుపుతున్నారు. గత కొన్ని రోజులుగా జయ సావంత్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తన తల్లి కోసం ప్రార్థించాలంటూ రాఖీ పలుమార్లు సోషల్ మీడియాలో కూడా కోరింది. కాగా చికిత్స తీసుకున్నప్పటికీ, పరిస్థితి విషమించడంతో... జయ సావంత్ కన్నుమూసింది.