
హైదరాబాద్: తన శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేసినట్లు తెలిసిందని.. ఇందుకు సంతోషిస్తున్నానని తెలిపారు ఈటల రాజేందర్. ఈ విషయంపై సీఎం కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేయలేదని..ఇకపై కూడా కలిసే ఉద్దేశం లేదన్నారు. మంత్రి పదవి తొలగింపుపై శనివారం మీడియాతో మాట్లాడిన ఈటల.. ప్లాన్ ప్రకారమే నాపై భూకబ్జా ఆరోపణలు చేశారన్నారు. పక్కా ప్లాన్ తోనే కుట్ర జరిగిందన్నారు. భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకుంటారని..నాపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వాస్తవాలు త్వరలోనే తేలుతాయన్న ఆయన. నా నియోజకవర్గ ప్రజలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు. సీఎంకు శాఖలపై సర్వాధికారాలు ఉంటాయని.. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నానన్నారు. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు ఈటల. రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.