నేనూ లావుగా ఉన్నా: బోరిస్ జాన్సన్

నేనూ లావుగా ఉన్నా: బోరిస్ జాన్సన్

లండన్: కొత్తగా చేసిన ఓ సర్వేలో ఊబకాయులకు కరోనా డెత్‌ రేట్‌ ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని తెలిసింది. దీంతో తమ దేశ పౌరులు ఫిట్‌గా ఉండటానికి ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలని యూకే ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై స్వయంగా ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్ స్పందించారు. తానూ చాలా ఫ్యాట్‌గా ఉన్నానని బోరిస్ చెప్పడం గమనార్హం. దేశ ప్రజలు ఫిట్‌గా ఉండటం కోసం ఎక్సర్‌‌సైజ్‌లు చేయాలని బోరిస్ పిలుపునిచ్చారు. సోమవారం కొత్త ఫిట్‌నెస్‌ డ్రైవ్‌ను బోరిస్ లాంచ్ చేశారు.

కొత్త డ్రైవ్ ప్రకారం పేషెంట్స్‌కు డాక్టర్‌‌లు సైక్లింగ్ లేదా రన్నింగ్ చేయాలని సూచిస్తారు. అందుకోసం యూకేలోని చాలా సిటీల్లో సైకిల్ లేన్స్, పెడెస్ట్రేషియన్‌ను సిద్ధం చేయనున్నారు. జంక్ ఫుడ్ అడ్వర్టయిజ్‌మెంట్‌లపై బ్యాన్ విధించారు. రాత్రి 9 గంటలలోపు జంక్ ఫుడ్ యాడ్స్‌ టెలికాస్ట్‌ చేయొద్దని ఆజ్ఞలు జారీ చేశారు. అలాగే సిగరెట్ ప్యాక్‌ల లాంటి వాటిపై కెలోరీస్‌ను సూచించే వార్నింగ్స్‌ను ముద్రించాలని యూకే సర్కార్ ఆదేశించింది.

‘చాన్నాళ్ల నుంచి బరువు తగ్గాలని అనుకుంటున్నా. చాలా మందిలాగే నేను కూడా బరువు సమస్యతో బాధపడ్డా. కరోనా నుంచి కోలుకున్నప్పటి నుంచి నేను నా ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టా. కానీ నేనెప్పుడైతే ఐసీయూకి వెళ్లానో అప్పుడు నేను చాలా అనారోగ్యంగా ఉన్నా. నేను భారీకాయంతో ఉన్నా. నేను చాలా ఫ్యాట్‌గా ఉన్నా. ఇప్పుడు నేను నా కుక్కతో కలసి పరిగెడుతూ రోజును ప్రారంభిస్తున్నా’ అని బోరిస్ చెప్పారు.