హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఆదేశిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి హరీష్ రావుపై పోటీ చేస్తానని ప్రకటించారు. ఎంత పెద్దపులి అయినా వేటగాడి వ్యూహంలో పడాల్సిందేనని.. ఓట్ల రాజకీయం కూడా అంతేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకే గతంలో తాను రెండుసార్లు ఓడిపోయానని.. పాలిటిక్స్‌లో కౌంటర్, ఎన్ కౌంటర్ కామనేనని పేర్కొన్నారు.
హాట్ టాపిక్‌గా సిద్దిపేట:
జగ్గారెడ్డి వ్యాఖ్యలతో సిద్దిపేట నియోజకవర్గం స్టేట్ పాలిటిక్స్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గతంలో టీఆర్ఎస్ చీఫ్ కవిత కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం సిద్దిపేట సెగ్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థి హరీష్ రావును ఓడించడం ఖాయమని సీఎం ధీమా వ్యక్తం చేశారు.తాజాగా జగ్గారెడ్డి కూడా హైకమాండ్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజంగానే జగ్గారెడ్డి, కవిత సిద్దిపేటలో హరీష్ రావుపై బరిలోకి దిగితే మాత్రం ఈ పోరు స్టేట్ పాలిటిక్స్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫైట్‌గా నిలవనుంది.
