దీపావళి వేడుకల్లో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

దీపావళి వేడుకల్లో పాల్గొన్న  బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

ఇటీవల బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన భారతి సంతతి వ్యక్తి రిషి సునాక్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రిటన్ అభివృద్ధికి తన సాయశక్తులా చేయగల్గినంతా చేస్తానని స్పష్టం చేశారు. డౌనింగ్ స్ట్రీట్ లో జరిగిన దీపావళి సంబరాల్లో పాల్గొన్న సునాక్.. ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. దీంతో పాటు ఈ కార్యక్రమంలో దిగిన ఫొటోను ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

https://twitter.com/RishiSunak/status/1585342561018839044

ఈ సందర్భంగా భవిష్యత్తుల్లో బ్రిటన్ ను అభివృద్ధి చేసేందుకు, రాజకీయాలకతీతంగా పనిచేస్తామని చెప్పారు. అందరం కలిసి కట్టుగా నిలబడి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించగలమని చెప్పారు. భవిష్యత్తు తరాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుకుని, వారు భవిష్యత్తుపై ఆశాజనకంగా ఉండేటట్లు చేస్తానని స్పష్టం చేశారు.