గెలిచాక మరుసటిరోజే ప్రగతిభవన్ వద్ద దీక్ష చేస్తా

గెలిచాక మరుసటిరోజే ప్రగతిభవన్ వద్ద దీక్ష చేస్తా
  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను గెలిచాక మరుసటిరోజే ప్రగతిభవన్ కు వెళ్లి నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ గురించి అడుగుతా.. అమలు చేయకపోతే ప్రగతి భవన్ వద్దే బైఠాయించి దీక్ష చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి సంచలన ప్రకటన చేశారు.  రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చెల్, కుత్బుల్లాపూర్ లో కాంగ్రేస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఎంపీ రేవంత్ రెడ్డితో కలసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగ కార్యకర్తలతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి మాట్లాడుతూ.. నేను గెలిచిన మరుసటిరోజే ప్రగతిభవన్ కు  వెళ్లి నిరుద్యోగులకు భృతి, ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్లు విడుదల చేయాలని వినతిపత్రం సమర్పిస్తా.. అమలు చేయకపోతే  అక్కడే దీక్ష చేస్తానన్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ మొండి చేయి చూపారన్నారు.సీఎం కేసీఆర్ తెలంగాణ నీళ్లు జగన్ కు, నియామకాలు ఆయన కుటుంబానికి, నిధులన్నీ తన బంధువులకు,  తనకు ఇచ్చుకుంటున్నాడని విమర్శించారు. మొన్న వరదల్లో అర్హులైన అనేక మందికి రూ. 10వేలు ఇవ్వలేదన్నారు. టీఎస్ పీఎస్సీ లో 23లక్షల మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు పై భాజపా, తెరాస పార్టీలు ఒకరిపై ఒకరు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. మంత్రి కేటీఆర్ కు సవాల్ విసురుతూ మార్చ్ 8న పార్లమెంట్ ప్రారంభం అవుతుంది.. తెలంగాణ పునర్విభజన చట్టం లో పెట్టిన అంశాలను అమలు చేయడానికి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఆర్, గిరిజన యూనివర్సిటీ పై ఆమరణ నిరాహార దీక్ష చేద్దామని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని పీవీ గారి ఆత్మ గౌరవం పెరగాలంటే పీవీ కుమార్తె వాణి దేవి కూడా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి చిన్నా రెడ్డి కి మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు.

ఇవి కూడా చదవండి

పంత్ సూపర్ సెంచరీ.. పట్టు బిగిస్తున్న భారత్

రెస్టారెంట్ సిబ్బందికి కరోనా.. భయాందోళనలో భోజన ప్రియులు

రూ.200తో 50వేల టెస్టులు చేసేలా సీసీఎంబీ పరిశోధనలు

టీఆర్ఎస్, బీజేపీలను ఓడిస్తే.. ప్రభుత్వాలు దిగొచ్చి ధరలు తగ్గిస్తాయి