Fighter Movie Issue: చిక్కుల్లో హృతిక్ రోషన్ ఫైటర్..లీగల్ నోటీసు పంపిన IAF ఆఫీసర్

Fighter Movie Issue: చిక్కుల్లో హృతిక్ రోషన్ ఫైటర్..లీగల్ నోటీసు పంపిన IAF ఆఫీసర్

బాలీవుడ్ స్టార్‌ హీరో హృతిక్ రోషన్ (Hritik Roshan), గ్లామర్ డాల్ దీపికా పదుకోనే (Deepika Padukone) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్‌(Fighter). వార్‌, పఠాన్ వంటి యాక్షన్ మూవీస్ తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ సిద్ధార్థ్‌ ఆనంద్‌ (Siddharth Anand) ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బ్యాక్డ్రాప్ లో..అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ తాజాగా చిక్కుల్లో పడింది. 

ఈ మూవీలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్స్గా నటించిన హృతిక్..దీపికా మధ్య వచ్చే ముద్దు సీన్స్ ఎయిర్‌ఫోర్స్‌ యూనిఫాంలో ఉండటం వల్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ముద్దు సీన్స్పై సౌమ్యదీప్ దాస్ ఐఏఎఫ్ (IAF) అధికారి వ్యతిరేకిస్తూ..ఫైటర్ మేకర్స్‌కి లీగల్ నోటీసు పంపారు. ఫైటర్ ప్రొడక్షన్ టీమ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నోటీసులో తెలిపారు.

అలాగే భాద్యతమైన ఆఫీసర్స్గా యూనిఫాంతో సంబంధం ఉన్న పాత్రలో నటించిన హృతిక్..దీపికా..ఎయిర్‌ఫోర్స్‌ గౌరవాన్ని అగౌరవపరచడం అని అధికారి వాదించారు. యూనిఫారమ్‌లో హీరో హీరోయిన్స్ వారి అధికారిక విధులకు సంబంధం లేని కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్లు సీన్స్ చూపించడం ద్వారా..భారత వైమానిక దళ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా యూనిఫాం యొక్క పవిత్రత మరియు ప్రాముఖ్యతను కూడా అగౌరవపరిచారు అని నోటీసులో వెల్లడించారు. మరి ఈ వివాదంపై మేకర్స్ నుంచి వచ్చే స్పందన ఎలా ఉండబోతుందో చూడాలి. 

ఫైటర్‌ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) రికార్డ్ ధరకు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నది. దాదాపు రూ.75 కోట్ల మేరకు నెట్‌ఫ్లిక్స్ ఫైటర్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మార్చి 29న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 302 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది