హైదరాబాద్ లో విమానం హై టెన్షన్.. : 3 గంటల తర్వాత.. 14 మందితో సేఫ్ ల్యాండింగ్

హైదరాబాద్ లో విమానం హై టెన్షన్.. : 3 గంటల తర్వాత.. 14 మందితో సేఫ్ ల్యాండింగ్

హైదరాబాద్ సిటీలో శుక్రవారం హై టెన్షన్.. 2024.. మార్చి ఒకటో తేదీ మధ్యాహ్నం.. పైలెట్లకు శిక్షణ ఇచ్చే విమానం.. 14 మంది స్టూడెంట్స్ తో గాల్లోకి లేచింది.. గాల్లో 20 నిమిషాలు తిరిగిన తర్వాత బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది.. ల్యాండింగ్ కు పైలెట్ రెడీ అవుతున్న సమయంలో.. సాంకేతిక లోపంతో విమానం టైర్లు ఓపెన్ కాలేదు.. సగం మాత్రమే ఓపెన్ అయ్యాయి.. అంతే సెకన్ల టైంలో.. వెంటనే మళ్లీ గాల్లోకి లేచింది విమానం.. ఆ తర్వాత పదే పదే ప్రయత్నించినా టైర్లు పూర్తిగా ఓపెన్ కాలేదు. విమానంలో ఆయిల్ ఫుల్ గా ఉంది. దీంతో మూడు గంటలపాటు.. హైదరాబాద్ సిటీపై.. బేగంపేట ఎయిర్ పోర్టు చుట్టూ గాల్లోనే చక్కర్లు కొట్టింది విమానం. 

విమానంలో ఫుల్ ట్యాంక్ ఆయిల్ ఉన్నప్పుడు అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నిస్తే.. పేలిపోయే ప్రమాదం ఉండటంతో.. 90 శాతం ఆయిల్ అయిపోయే వరకు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. ఈ లోపు ఎయిర్ పోర్టు అధికారులు అత్యవసర ఏర్పాట్లు చేశారు. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యారు. ఫైర్ సర్వీస్, అంబులెన్స్, డిజాస్టర్ టీంలను బేగంపేట ఎయిర్ పోర్టుకు రప్పించారు. దీంతో హైటెన్షన్ నెలకొంది.

ఆయిల్ దాదాపు అయిపోతుంది అనుకున్న టైంలో.. విమానం ల్యాండింగ్ కు పర్మీషన్ ఇచ్చారు అధికారులు. సగం ఓపెన్ అయిన చక్రాలతో చాలా జాగ్రత్తగా విమానాన్ని బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు పైలెట్లు. శిక్షణ ఇచ్చే పైలెట్లు కావటంతోపాటు.. సీనియర్ పైలెట్లు కావటంతో.. ఎలాంటి క్రాష్ ల్యాండింగ్ లేకుండా సురక్షితంగా విమానాన్ని రన్ వేపై ల్యాండ్ చేశారు. ఎలాంటి ప్రమాదం లేకుండా విమానం దిగటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

పైలెట్ శిక్షణ కోసం విమానంలో ఉన్న 14 మంది స్టూడెంట్స్ సేఫ్ గా బయటకు వచ్చారు. ఎయిర్ పోర్టుకు వచ్చిన అంబులెన్సులు, ఫైర్ సేఫ్టీ వాహనాలు, డిజాస్టర్ టీం తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. విమానంలో లోపాలను టెక్నికల్ టీం పరిశీలిస్తుంది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని.. ఫస్ట్ టైం అంటున్నారు అధికారులు. 

ALSO READ :- ఏం చెప్పాలని.. మేడిగడ్డ యాత్ర: కోదండరాం

మొత్తానికి మూడు గంటలపాటు హైదరాబాద్ సిటీలో హైటెన్షన్ పుట్టించింది విమానం. బేగంపేట ఎయిర్ పోర్టు పరిసరాల్లో మూడు గంటలుగా ఒకే విమానం చక్కర్లు కొట్టటంతో స్థానికులు సైతం భయాందోళనలకు గురయ్యారు. ఏమైందీ.. పదేపదే ఆ విమానం అలా ఎందుకు తిరుగుతుంది అంటూ కంగారుపడ్డారు జనం..