ఏం చెప్పాలని.. మేడిగడ్డ యాత్ర: కోదండరాం

ఏం చెప్పాలని.. మేడిగడ్డ యాత్ర: కోదండరాం
  •  బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఫైర్

  •  అప్పుడు మోటర్లు మునిగాయి.. ఇప్పుడు పిల్లర్లు కుంగాయ్

  • భూకంప జోన్ లో మల్లన్నసాగర్.. ముంపునూ పట్టించుకోలే

  •  డీపీఆర్ లేకుండానే  వర్క్ స్టార్ట్.. అంచనాలు పెంచి పనులు

హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు ఏం చెప్పాలని మేడిగడ్డ యాత్రకు వెళ్తున్నారని  టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణమంతా లోప భూయిష్టంగా జరిగిందన్నారు. గతంలో భారీ వర్షాలకు పంప్ హౌజ్, మోటార్లు మునిగిపోయాయని చెప్పారు. ప్రస్తుతం మూడు పిల్లర్లు కుంగిపోయాయన్నారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

ALSO READ :- 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్.. బిల్లు జనరేట్ చేస్తున్న సిబ్బంది

భూకంప జోన్ లో మల్లన్న సాగర్  నిర్మించారని అన్నారు. కట్టిన ప్రాజెక్టులో నీళ్లు నింపలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. తాము కాళేశ్వరం లిఫ్ట్ ముంపు ప్రాంతాల్లో పర్యటించామని, వైఫల్యాలను ప్రజలకు వివరించామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి డీపీఆర్ లేకుండా పనులు ప్రారంభించి అంచనాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోయిందన్నారు.