200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్.. బిల్లు జనరేట్ చేస్తున్న సిబ్బంది

200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్.. బిల్లు జనరేట్ చేస్తున్న సిబ్బంది


హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా  ఇవాళ్టి నుంచి  వినియోగదారులకు జీరో బిల్లుల జారీ ప్రారంభమైంది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ ను కాంగ్రెస్​ప్రభుత్వం అందిస్తుంది.  వైట్ రేషన్ కార్డు ఉండి ప్రజా పాలన దరఖాస్తులలో  అప్లై చేసుకున్న వారికి ఉచిత్ విద్యుత్ ను అందిస్తున్నారు. ఈ మేరకు విద్యుత్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి మీటర్ చెక్ చేసి 200 లోపు యూనిట్లు కరెంట్ వాడుకున్న  వారికి జీరో బిల్లు జనరేట్ చేసి బిల్లు జారీ చేస్తున్నారు.  ఇటీవల సచివాలయంలో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి..గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు.  

ALSO READ :- గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. ఎమ్మెల్యే మురళీనాయక్ ఆగ్రహం

 వనపర్తి  జిల్లాలో ఇవాళ ఉదయం గృహవినియోగదారులకు జీరో కరెంట్ బిల్లుల ప్రక్రియ ప్రారంభమైంది. పట్టణంలో ఓ వినియోగదారుడికి ఫిబ్రవరి నెలకు సంబంధించి జారీ చేసిన బిల్లులో 86 యూనిట్ల కరెంట్​ వినియోగించినట్లు జీరో బిల్లులో పేర్కొన్నారు. వాడుకున్న కరెంట్ కు గాను ఎనర్జీ చార్జెస్​కింద రూ. 143, ఫిక్స్​డ్​ చార్జిలకింది రూ.10. కస్టమర్​ చార్జిల కింద రూ 70. ఎలక్ట్రిసిటీ డ్యూటీ కింద రూ.3, సర్​చార్జిల కింద రూ. 25 కలిపి మొత్తం రూ. 252 బిల్లును జారీ చేశారు. కేవలం 86 యూనిట్ల కరెంట్​ వాడడంతో  అతనికి జీరో బిల్లును విద్యుత్​ సిబ్బంది జారీ చేశారు.