15 వేల అడుగుల ఎత్తులో.. ‘స్వచ్ఛ భారత్’ కోసం సైనికుల స్కైడైవ్

15 వేల అడుగుల ఎత్తులో.. ‘స్వచ్ఛ భారత్’ కోసం సైనికుల స్కైడైవ్

మహాత్మా గాంధీ జయంతి నాడు ‘స్వచ్ఛ భారత్’ కోసం భారత వాయుసేన అరుదైన ఫీట్ చేసింది. నడి ఆకాశంలో… భూమి నుంచి 15 వేల అడుగుల ఎత్తులో క్యాపైన్ చేశారు మన సైనికులు.

స్వచ్ఛ భారత్ ప్రచారం కోసం ‘స్వచ్ఛత వైపు ఒక్క అడుగు’ అన్న నినాదం రాసి ఉన్న తెల్లటి జెండాతో నింగిలో ఫీట్ చేశారు వీర జవాన్లు. భారత వాయుసేన విమానంలో ఆకాశంలోకి వెళ్లి.. 15 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ చేశారు.

నడి ఆకాశంలో చేతులు మారిన జెండా..

నడి ఆకాశంలో వేగంగా వెళ్తున్న ఐఏఎఫ్  నుంచి ఫ్లైట్ లో నుంచి కిందకి దూకారు ఎయిర్ కమాండర్ వేదజ్ఞ, వింగ్ కమాండర్ గజానంద్ యాదవ్. స్వచ్ఛ భారత్ జెండాతో వేదజ్ఞ స్కైడైవ్ చేసి.. నింగి నుంచి కిందికి దూసుకొస్తున్నారు.

ఆ వేగంలోనే తనతో పాటు డైవ్ చేసిన గజానంద్ కు ఆ జెండాను అందజేశారు. ఈ ఫీట్ పూర్తి చేసిన తర్వాత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో తోటి సైనికులతో కలిసి ఫొటో దిగారు. ఈ క్యాంపెయిన్ ద్వారా స్వచ్ఛ భారత్ ప్రాధాన్యతను నింగికి చాటాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు.