
ఉత్తరప్రదేశ్: పాకిస్తాన్పై యుద్ధానికి సర్వం సిద్ధం అవుతుంది మన సైన్యం. ఇప్పటికే అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్న భారత సైన్యం.. ఇప్పుడు సరికొత్త ఎత్తుగడతో ముందుకు సాగుతుంది. యుద్ధ విమానాలను బయటకు తీసింది. జాతీయ రహదారులపై యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాపూర్ లోని ఆరు లైన్ల జాతీయ రహదారి ఉంది.
ఈ హైవేపై యుద్ధ విమానాలు ల్యాండింగ్ ట్రయిల్స్ వేస్తున్నాయి. పగలు, రాత్రి జాతీయ రహదారులపై యుద్ధ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ ఎలా ఉంటుంది.. ఎదురయ్యే సమస్యలు ఏంటీ.. ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఏంటీ.. సిగ్నల్స్ వ్యవస్థ.. రాడార్ వ్యవస్థ ఎలా ఉంది అనే అన్ని రకాలుగా పరిశీలిస్తుంది ఇండియన్ ఆర్మీ.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ ఫస్ట్ టైం ఎక్స్ప్రెస్ వేపై ల్యాండ్ కాబోతున్నాయి. యూపీలోని షాజహాన్పూర్ జిల్లాలోని గంగా ఎక్స్ ప్రెస్ వేపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ బిల్ట్పై యుద్ధ సన్నాహాల్లో భాగంగా రాఫెల్, మిరేజ్, జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ రాత్రిపగలు ల్యాండింగ్ డ్రిల్స్ చేయనుండటం గమనార్హం. ఈ ఈవెంట్ కు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్తో పాటు భారత వైమానిక దళానికి చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన వైమానిక దళ శక్తిసామర్థ్యాలను ఈ ల్యాండింగ్ డ్రిల్లో ప్రదర్శించనుంది. గంగా ఎక్స్ ప్రెస్ వేను 3.2 కిలోమీటర్ల పరిధిలో నిర్మించారు. ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ కోసమే ఈ ఎక్స్ ప్రెస్ వేను ఉత్తర్ ప్రదేశ్ ఎక్స్ ప్రెస్ వేస్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ నిర్మించింది.
#UPCM श्री @myogiadityanath जी के कुशल नेतृत्व में उत्तर प्रदेश के चौतरफा हिस्सों को जोड़ने के लिए हाईटेक एक्सप्रेसवे तैयार किए जा रहे हैं। वर्तमान में उत्तर प्रदेश एक्सप्रेसवे के मामले में देश में शीर्ष स्थान पर है।
— Government of UP (@UPGovt) May 2, 2025
प्रदेश का सबसे लम्बा एक्सप्रेसवे #GangaExpressway (594 KM)… pic.twitter.com/LZ1pHRSLzt