కిమ్‌ తిరిగొచ్చినందుకు హ్యాపీగా ఉంది: ట్రంప్‌

కిమ్‌ తిరిగొచ్చినందుకు హ్యాపీగా ఉంది: ట్రంప్‌
  • ట్వీట్‌ చేసిన అమెరికా ప్రెసిడెంట్‌

వాషింగ్టన్‌: నార్త్‌కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తిరిగొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందని అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. కిమ్‌ ఆరోగ్యం పై గత కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలన్నీ తప్పని తేలుస్తూ కిమ్‌ శుక్రవారం ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారని నార్త్‌కొరియా అధికారిక మీడియా ఫొటోలు రిలీజ్‌ చేసింది. “ ఆయన (కిమ్‌) తిరిగి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను” అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. కిమ్‌ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ట్రంప్‌ మొదటి నుంచి ఖండిస్తూనే ఉన్నారు. ఆయన అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పారు. కిమ్‌ త్వరాగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కూడా ట్రంప్‌ చెప్పారు.