
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్తగా తెచ్చిన యాంటీ–టొబాకో వార్నింగ్ రూల్స్ అమలు చేయడం ప్రాక్టికల్‌గా ఓవర్ది టాప్(ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌కు కష్టమవుతుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వెల్లడించింది. ఓటీటీలలో చూపించే కంటెంట్ అంతటా ఇలాంటి వార్నింగ్ చూపించడం అసాధ్యమవుతుందని తెలిపింది. కన్జూమర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్పైనా ఈ కొత్త రూల్స్ ఎఫెక్ట్ పడుతుందని పేర్కొంది. థియేటర్లు, టెలివిజన్ ప్రోగ్రామ్‌ల తరహాలోనే ఓటీటీలు కూడా కంటెంట్‌లో యాంటీ–టొబాకో వార్నింగ్స్ చూపించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా రూల్స్ తెచ్చింది. కొత్త రూల్స్ తెచ్చేముందు పరిశ్రమతో అసలు చర్చించనేలేదని చెబుతూ, ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్ప్రొవైడర్లు (ఓసీసీపీ) ఐటీ రూల్స్ కింద ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నారని వివరించింది. ఎంఐబీ వద్ద 57 ఓసీసీపీలు రిజస్టరయ్యాయి. వీటిలో ఒక్క దానిని కూడా కొత్త రూల్స్ తేవడానికి ముందు సంప్రదించ లేదని ఐఏఎంఏఐ వాపోయింది.