IAS కి రాజీనామా చేసి వైసీపీలో చేరిన ఇంతియాజ్..!

IAS కి రాజీనామా చేసి వైసీపీలో చేరిన ఇంతియాజ్..!

2024 ఎన్నికల సమరం కోసం అభ్యర్థుల విషయంలో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరికి షాక్ ఇస్తున్నాయి. తాజాగా IAS కి రాజీనామా చేసి పార్టీలో చేరిన సీనియర్ IAS  అధికారి ఇంతియాజ్ కి కర్నూల్ అసెంబ్లీ సీటును కేటాయించటం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. గతంలో సెర్ప్ సీఈఓగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పని చేసిన ఇంతియాజ్ పదవికి వీఆరెస్ ఇచ్చి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ALSO READ :- ప్రతి ఫిబ్రవరి 29 మాత్రమే ఈ పేపర్ వస్తుంది.. ధరెంతో తెలిస్తే షాక్

ఇంతియాజ్ కి కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి టికెట్ కేటాయించనున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే సీఎం జగన్ ఇంతియాజ్ ను కర్నూల్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. పాలిటిక్స్ కి సంబంధం లేనివారిని అభ్యర్థులుగా ప్రకటించటం జగన్ కి ఇది కొత్తేమి కాదు గత ఎన్నికల్లో కూడా ఫిజియోతెరపిస్ట్ అయిన గురుమూర్తి వంటి వారికి టికెట్ ఇచ్చి గెలిపించిన ట్రాక్ జగన్ కి ఉంది. మరి, కర్నూల్ అసెంబ్లీ స్థానానికి గాను జగన్ వేసిన ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.