ఐఏఎస్, ఐపీఎస్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు : మాజీ IAS చంద్రవదన్

ఐఏఎస్, ఐపీఎస్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు : మాజీ IAS చంద్రవదన్

హైదరాబాద్ : ఐఏఎస్, ఐపీఎస్లకు రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని, వారు నిరంతరం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత చంద్రవదన్ అన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. 

అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ప్రతి ఏడాది ట్రైనింగ్ కు వెళ్లాల్సి ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోందని చంద్రవదన్ అ న్నారు. చట్టం, రూల్ ఆఫ్ లా ప్రకారం రాష్ట్రంలో ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు విధులు నిర్వర్తించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.