కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో నాపేరు తొలగించండి..హైకోర్టులో స్మితా సబర్వాల్ పిటిషన్

 కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో నాపేరు తొలగించండి..హైకోర్టులో స్మితా సబర్వాల్ పిటిషన్

 తెలంగాణ హై కోర్టులో ఐఏఎస్ అఫీసర్  స్మితా సబర్వాల్ పిటిషన్ వేశారు. కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో తన పేరును తొలగించాలని  పిటిషన్ లో తెలిపారు.  వివరణ ఇచ్చేందుకు తనకు 8b ,8c నోటీసులు ఇవ్వలేదని.. పీసీ ఘోష్  కమిషన్ రిపోర్టును క్వాష్  చేయాలని కోరారు. 

 స్మిత సబర్వాల్ ను విచారించిన పీసీ ఘోష్ కమిషన్ ఆమె  చర్యలను రిపోర్టులో తెలిపింది. కాళేశ్వరం నిర్మాణాలపై స్మితా సబర్వాల్ రివ్యూ చేసిందని  కమిషన్  చెప్పింది.  స్మిత సబర్వాల్  కొన్ని జిల్లాలు తిరిగి  ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ను  సీఎంకు చేరవేసిందని తెలిపింది.  చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో పలు సందర్భాల్లో స్మిత సబర్వాల్ మూడు బ్యారేజీలను సందర్శించారని రిపోర్టులో వెల్లడించింది. స్మిత సబర్వాల్  బ్యారేజ్ లను సందర్శించిన  పలు ఫోటోలను  సైతం రిపోర్టులో  పొందుపరిచింది పీసీ ఘోష్  కమిషన్. కాళేశ్వరం పై అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో స్మిత సబర్వాల్ కీలకపాత్ర పోషించిందని తెలిపింది... నిజా నిజాలను క్యాబినెట్ ముందు పెట్టనందుకు స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని కమిషన్ రిపోర్టు వెల్లడించింది.

తెలియదు..యాదికి లేదు

 బీఆర్ఎస్ హయాంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ ను  కాళేశ్వరం కమిషన్   విచారించిన సంగతి తెలిసిందే..విచారణలో  పలు ప్రశ్నలకు ‘‘లేదు.. తెలియదు.. యాదికి లేదు’’ అని ఆమె సమాధానాలు చెప్పారు.  కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన ఏ ఫైల్​ కూడా కేబినెట్​ ముందుకుగానీ, సీఎంవోకి గానీ రాలేదని  స్మితా సభర్వాల్​ స్పష్టం చేశారు.  ప్రతిపాదనలు మాత్రమే కేబినెట్  ముందుకు వచ్చాయని.. ఆర్థికాంశాలపై చర్చించేందుకే ఆ ప్రతిపాదనలు పెట్టారని తెలిపారు. జీవోను కూడా కేబినెట్​లో పెట్టలేదని కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ ముందు ఆమె ఒప్పుకున్నారు. నాడు సీఎం సెక్రటరీగా మీ పనులేంటో చెప్పాలని స్మితా సభర్వాల్​ను కాళేశ్వరం కమిషన్​ ప్రశ్నించింది. తనకు 7 ప్రధాన సబ్జెక్టులను అప్పగించారని ఆమె చెప్పారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించి తాను జిల్లాల్లో పర్యటించానని, ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఫీడ్​బ్యాక్​ను నాటి సీఎంకు చెప్పానని తెలిపారు. అయితే, తన పరిధి కేవలం జనరల్​ కో ఆర్డినేషన్​కే పరిమితమని ఆమె స్పష్టం చేశారు.

►ALSO READ | BSNL బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరలకే హై స్పీడ్ ఇంటర్నెట్.. FTTH ప్లాన్స్ ఇవే..