హైదరాబాద్, వెలుగు: కారుగేటెడ్ ప్యాకేజింగ్ (కార్డ్ బోర్డ్ బాక్సుల) రంగం పర్యావరణానికి మేలు చేయడమేగాక, ఎకానమీకి వెన్నెముకగా నిలుస్తోందని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ వేదికగా 2027 జనవరిలో జరిగే ఇంటర్నేషనల్ కారుగేటెడ్కేస్ అసోసియేషన్(ఐసీసీఏ) గ్లోబల్ సమిట్ కోసం బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
64 ఏళ్ల ఈ సంస్థ చరిత్రలో తొలిసారిగా మన నగరంలో ఈ అంతర్జాతీయ సదస్సు జరగడం గర్వకారణమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సదస్సుకు పూర్తి సహకారం అందిస్తుందని, దీని ద్వారా కొత్త పారిశ్రామిక పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం దేశీయ ప్యాకేజింగ్ పరిశ్రమ విలువ రూ.90 వేల కోట్లుగా ఉందని, ఇది భవిష్యత్తులో వేగంగా వృద్ధి చెందుతుందని కుమార్ వివరించారు. ఈ మెగా ఈవెంట్ లో ఎఫ్సీబీఎం కారుప్యాక్ సమిట్, కారుప్యాక్ ఇంటర్నేషనల్ ఎక్స్పో కూడా ఉంటాయి.
