
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) ప్రొబెషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 5,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో ప్రొబెషనరీ ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగ జీవితం ప్రారంభించి అత్యున్నత హోదాకు ఎదిగే అవకాశం ఉంటుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల చివరి తేదీ జులై 21.
పోస్టులు: 5,208 (ప్రొబెషనరీ ఆఫీసర్/ మేనేజ్ మెంట్ ట్రైనీ)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత లేదా సమాన అర్హత ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీ మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్
ఇది కేవలం క్వాలిఫయింగ్ ఎగ్జామ్ మాత్రమే. ఇందులో వచ్చిన మార్కులను ఫైనల్ మెరిట్లో కలపరు. ప్రిలిమ్స్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలకు 30 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలకు 30 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 40 మార్కులకు మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4 వంతు మార్కులు కోత విధిస్తారు. అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ కటాఫ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ALSO READ : కాలుకు సర్జరీ చేస్తే గుండెపోటుతో బాలుడు మృతి
మెయిన్స్ ఎగ్జామినేషన్
ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో ఐబీపీఎస్ నిర్దేశించిన కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులను మెయిన్స్‌కు షార్ట్ లిస్ట్ చేస్తారు. మెయిన్స్‌లో రీజనింగ్, జనరల్ అవేర్ నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్ 40 ప్రశ్నలు 60 మార్కులకు, జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్/ డిజిటల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 35 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 35 ప్రశ్నలకు 40 మార్కులకు, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 35 ప్రశ్నలు 50 మార్కులకు మొత్తం 145 ప్రశ్నలకు 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. వెంటనే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ఎకనామిక్స్, సోషల్ ఇష్యూస్, బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీలో ట్రెండ్స్, కరెంట్ ఈవెంట్స్, ఎథిక్స్ ఎస్సే, కాంప్రెహెన్షన్ నుంచి 2 ప్రశ్నలు 25 మార్కులకు ఇస్తారు. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్‌లో ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
ఇంటర్వ్యూ
ప్రతి అభ్యర్థి మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో కటాఫ్ స్కోరును సాధించాలి. కటాఫ్ ఉద్యోగ ఖాళీల సంఖ్యను అనుసరించి ఐబీపీఎస్ నిర్ణయిస్తుంది. అంతేకాకుండా మెయిన్స్‌లో మెరుగైన స్కోరును సాధించిన వారినే ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూలో 40 శాతం మార్కులు మినిమమ్ క్వాలిఫయింగ్ మార్కులకు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో మినిమమ్ క్వాలిఫయింగ్ మార్కులు సాధించిన అభ్యర్థులను తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు. మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. పూర్తి వివరాలకు www.ibps.in వెబ్సైట్లో
సంప్రదించగలరు.
ముఖ్యమైన వివరాలు
అప్లికేషన్లు ప్రారంభం: జులై 01.
లాస్ట్ డేట్: జులై 21.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 175. ఇతర అభ్యర్థులకు రూ.850.
ప్రిలిమ్స్: 2025, ఆగస్టు 17, 23, 24.
మెయిన్స్ ఎగ్జామ్ డేట్: 2025, అక్టోబర్ 12.
పర్సనల్ ఇంటర్వ్యూ: 2025, డిసెంబర్/ ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్: 2025, నవంబర్ నుంచి 2026, జనవరి